ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్నా మొదటి వరుసలో ఉంటారు. ప్రస్తుతం రూపొందుతోన్న ప్రస్టేజియస్ సినిమాల్లో ఎక్కువ శాతం కథానాయిక రష్మికే. బాలీవుడ్లో సైతం ఈ అందాలభామ వైభవం ఓ రేంజ్లో వెలిగిపోతున్నది. ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరుగానే ఉంటూ ఉంటుంది రష్మిక.
రీసెంట్గా సోషల్ మీడియాలో వర్షాలపై ఆసక్తికరంగా ఓ పోస్ట్ పెట్టింది తను. ‘వర్షాకాలం వచ్చేసింది. నిజానికి నాకు వర్షాకాలం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్షాల వల్ల పనులు మందగిస్తాయి. వర్క్ స్పీడ్‌గా జరగదు. అయితే.. వర్షం వచ్చే ముందు వచ్చే మట్టి వాసన అంటే మాత్రం నాకెంతో ఇష్టం. ఆ స్మెల్ వస్తే.. గుండెల నిండా పీల్చేసుకుంటా.’ అంటూ పోస్ట్ చేసింది రష్మిక.