Rashmika mandanna | కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా రష్మిక మందన్న.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్ పోస్టర్
వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి రష్మిక. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలతో నటిస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ఇటు టాలీవుడ్లో అటు
Rashmika mandanna | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి రష్మిక. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలతో నటిస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో వరస సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈమె దుల్కర్ సల్మాన్‌తో జోడి కట్టనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. మంగళవారం ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా అఫ్రిన్ పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన ఈమె లుక్ ఆకట్టుకుంటుంది. దుల్కర్ ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మృనల్ థాకూర్ మరో హీరోయిన్గా నటిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.ఇటీవలే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రంలో రష్మిక కథానాయిక పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ లేటెస్ట్‌గానే ప్రకటన ఇచ్చారు.
Meet our rebellious #Afreen as she unravels one of the most beautiful tales ever.
Happy birthday @iamRashmika ♥️▶️ https://t.co/oO6W2VfbZQ#declassifiessoon @dulQuer @hanurpudi @mrunal0801 @AshwiniDuttCh @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/6D09fNLlsC
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 5, 2022
Read Also:
Samantha | బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న సమంత.. పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్
Chiranjeevi | సుకుమార్ యాడ్ కోసం చిరు అంత పారితోషికాన్ని తీసుకున్నాడా?
Balakrishna-Raviteja | బాలకృష్ణ-రవితేజ మల్టీస్టారర్..?
Ranbir-Alia Bhatt | రణ్‌బీర్-ఆలియా బ్యాచ్‌లర్ పార్టీ.. సీక్రెట్ గెస్ట్‌లు వీరే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

