Balakrishna-Raviteja | ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా కొనసాగుతుంది. 80,90లో సినీయర్ హీరోలు తరుచూ మల్టీస్టారర్లు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మల్టీస్టారర్లు ఊపందుకుంటున్నాయి. కథ నచ్చితే టాప్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కూడా మల్టీస్టారర్లను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రూపొందుతున్నట్లు తెలుస్తుంది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్3’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రిప్ట్ పనులు పూర్తైపోయాయి. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు మరో హీరో కూడా నటించనున్నట్లు సమాచారం. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మాస్రాజ రవితేజ మరో ప్రధాన హీరోగా నటించనున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.