Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. ఇటీవల తన జన్మదినోత్సవం సందర్భంగా రష్మిక మందన్న సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘విజయ్ దేవరకొండతో మీరు ప్రేమలో ఉన్నారని తెలిసింది. అంతేకాదు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారట కదా..’ అని అడిగారు. దీనిపై రష్మిక మందన్న తనదైన హాస్య చతురతతో స్పందించింది.
‘అయ్యో..ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు బాబూ’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. డేటింగ్ రూమర్స్‌పై విజయ్, రష్మిక అనేక ఇంటర్వ్యూల్లో స్పష్టత నిచ్చారు. ఇద్దరం మంచి స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి లవ్‌ఎఫైర్ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.