Rashmika Mandanna | సినీ పరిశ్రమలో కమిట్మెంట్ ఉన్న యాక్టర్లు చాలా మందే ఉన్నారు. అయితే సినిమా కోసం ప్రాణం పెట్టేందుకు రెడీగా ఉండే యాక్టర్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి జాబితాలో టాప్‌లో ఉంటుంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే ఈ కన్నడ భామ పుష్ప ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిందని తెలిసిందే.
సిల్వర్ స్క్రీన్‌పై శ్రీవల్లిగా తనదైన స్టాంప్ వేసుకుంది. కాగా పుష్ప 2 విడుదల నేపథ్యంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సెట్స్‌లో అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీంతో ఉన్న ఫొటోలను అందరితో పంచుకుంది.
పుష్ప 2 విడుదల నేపథ్యంలో ఎమోషన్స్‌లో నేను మునిగిపోయాను. ఓ సినిమా కోసం టీమ్‌తో వ్యక్తిగతంగా ఇంతలా కనెక్ట్ అవడం. ఇప్పటివరకు ఏ సినిమా నన్ను ఇంతలా ప్రభావితం చేయలేదు. పుష్ప 2021 లో మొదలైంది. కానీ నాకు మాత్రం ఈ ప్రాజెక్ట్ కోవిడ్ కంటే ముందే ప్రారంభమైంది.
రోజు పుష్ప సెట్స్‌లో వచ్చే కంటే ముందు నేను చిత్తూరు యాసలో మాట్లాడేందుకు నాకు శిక్షణ ఇవ్వడానికి టీమ్ మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. పుష్ప 1 రిలీజ్, ఆపై పుష్ప 2 కోసం వెయిటింగ్.. చాలా కాలం పాటు పుష్ప 2 షూటింగ్ గత 5 సంవత్సరాలుగా ప్రతీరోజు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నారని సెట్స్‌లో టీంతో అరుదైన క్షణాలకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఏంటీ సంగతి..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఏఎంబీ మాల్లో..
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?