Rashmika Mandanna | పుష్ప ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌తో నేషనల్ క్రష్‌గా మారిపోయింది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). గ్లామరస్ పాత్రలతో నటనకు ఆస్కారమున్న రోల్స్‌లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది రష్మిక. ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ భామ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి Chhava. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా వస్తోన్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తుండగా.. ఇందులో రష్మిక ఛత్రపతి శివాజి సతీమణి మహారాణి ఏసుబాయిగా నటిస్తోంది. ఈ మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. ప్రతి గొప్ప రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాయి.. అని ట్వీట్ చేస్తూ తన పాత్ర లుక్‌ను షేర్ చేసింది రష్మిక మందన్నా. ఈ మూవీ ట్రైలర్ రేపు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రష్మిక పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
కథానుగుణంగా సినిమా పూర్తిగా మరాఠి భాషలో సాగనుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఈ నేపథ్యంలో రష్మిక మరాఠి భాష నేర్చుకుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
Behind every great king, there stands a queen of unmatched strength.
Maharani Yesubai – the pride of Swarajya. #ChhaavaTrailer Out Tomorrow!Releasing in cinemas on 14th February 2025.#Chhaava #ChhaavaOnFeb14@vickykaushal09 #AkshayeKhanna #DineshVijan @Laxman10072… pic.twitter.com/lclHEr2lAk
— Rashmika Mandanna (@iamRashmika) January 21, 2025
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్