Rashmika Mandanna | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే పూజా హెగ్డే, రష్మిక మందన పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రేసులో పూజా హెగ్డే కాస్త ముందుంది. ఎందుకంటే ఈమె కేవలం తెలుగు, తమిళ సినిమాలు మాత్రమే సైన్ చేస్తోంది. అప్పట్లో బాలీవుడ్లో వరుస సినిమాలు చేసిన పూజా.. ఇప్పుడు కేవలం సౌత్ ఇండస్ట్రీపై మాత్రమే ఫోకస్ చేస్తోంది. ఇక్కడ వరుసగా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది పూజా హెగ్డే. ఈమెకు పోటీగా రష్మిక మందన కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే ఒకే సమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా దృష్టి పెడుతుంది రష్మిక. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య సౌత్ సినిమాలు ఒప్పుకోవడం తగ్గించింది.
కేవలం స్టార్ హీరోలు ఉంటే మాత్రమే సినిమాలకు సైన్ చేస్తుంది. లేదంటే పూర్తిగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అందుకే దక్షిణాది నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నా కూడా కాదనుకుంటుంది ఈ కన్నడ కస్తూరి. ఒకవేళ సౌత్‌లో నటించాలంటే కండిషన్స్ అప్లై అంటుంది. కచ్చితంగా పెద్ద హీరో అయి ఉండాలి.. దాంతో పాటు పారితోషికం కనీసం 2.5 కోట్లు ఉండాలి.. అలా అయితేనే సినిమా ఒప్పుకుంటాను అని నిర్మాతలకు ఖరాకండిగా చెప్పేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగులో పుష్ప 2తో పాటు దుల్కర్ సల్మాన్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న సీతా రామం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రష్మిక. ఇక తమిళంలో సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తోంది. ఈ మధ్య శింబు, విశాల్ లాంటి హీరోలు అవకాశం ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసింది రష్మిక. పక్కా ప్లానింగ్‌తో కెరీర్లో ముందుకు వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు సొంత ఇండస్ట్రీ కన్నడలో అసలు సినిమాలు చేయడమే మానేసింది. అక్కడ పారితోషికం తక్కువ ఇవ్వడమే కాకుండా ఈమధ్య ఆమెపై కొన్ని కాంట్రవర్సీలు కూడా వచ్చాయి. అందుకే సొంత ఇండస్ట్రీని పూర్తిగా వదిలేసింది రష్మిక మందన.
“Rashmika Mandanna | ‘నాలో ఏదో తెలియని ఫీలింగ్’..రష్మిక ట్వీట్ వైరల్”
Rashmika Mandanna | ‘మీలో ప్రతీ ఒక్కరూ నాకు ముఖ్యమే’..రష్మిక పాజిటివ్ వైబ్స్”
Rashmika Mandanna | గ్రీన్ కలర్ డ్రెస్‌లో రష్మిక మందన్న అందాల అరబోత..”
Rashmika mandanna | స్పెషల్ సాంగ్‌లో రష్మికమందన్నా..నిజమెంత..?”