Thamma | కోవిడ్ తర్వాత నార్తిండియాలో థియేటర్‌కు వెళ్లే సినీ జనాల సంఖ్య తగ్గిపోయిందని తెలిసిందే. మరోవైపు హిందీలో థ్రియాట్రికల్ రిలీజ్‌తో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించేంతగా సినిమాలేమీ పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెరగడం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో థ్రియాట్రికల్ బిజినెస్ చాలా ప్రభావం పడింది.
ఈ ఏడాది ఛావా, స్త్రీ 2, Saiyaara సినిమాలు మినహా హిందీలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సినిమాలేమీ లేవు. వార్ 2, సికందర్, సితారే జమీన్ పర్, రైడ్ 2 భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. ఇక ప్రస్తుతం హిందీతోపాటు సౌతిండియా ప్రేక్షకుల చూపంతా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా కాంబోలో వస్తున్న Thamma సినిమాపైనే ఉంది.
మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ తెరకెక్కించిన హార్రర్ మూవీ స్త్రీ 2 సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌కు దీపావళి సీజన్లో మంచి బిజినెప్ ఉంటుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాడ్‌డాక్ హార్రర్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న Thamma థియేటర్లలో విడుదలవుతుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ సీజన్‌కు విడుదలవుతున్న సినిమాలేవీ లేకపోవడం కూడా రష్మిక, ఆయుష్మాన్ సినిమాకు బాగా కలిసొస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ మూవీతో బాలీవుడ్‌కు మరో సక్సెస్ రావడం పక్కా అయిపోయినట్టేనని అర్థమవుతున్నా.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.