Rashmika Mandana | అమ్మాయిలూ ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడండి.. డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక స్పందన
Rashmika Mandana | తన డీప్‌ఫేక్ వీడియో (deep fake video)పై నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) మరోసారి స్పందించారు. తన ఫేక్ వీడియో చూసి తొలుత చాలా బాధపడినట్లు చెప్పారు. ఏం చేయగలం అనిపించిందని.. ఆ తర్వాత దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నట్లు తెలిపారు.
Rashmika Mandana | తన డీప్‌ఫేక్ వీడియో (deep fake video)పై నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) మరోసారి స్పందించారు. రష్మిక నటించిన ‘యానిమల్’ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రొమోషన్స్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో రష్మిక మాట్లాడారు. తన డీప్‌ఫేక్ వీడియోపై స్పందించారు. ఫేక్ వీడియోలు సృష్టించడం ఈ రోజుల్లో సాధారణమైపోయిందని చెప్పారు. ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మనం కచ్చితంగా స్పందించాలని అన్నారు.
తన ఫేక్ వీడియో చూసి తొలుత చాలా బాధపడినట్లు చెప్పారు. ఏం చేయగలం అనిపించిందని.. ఆ తర్వాత దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నట్లు తెలిపారు. అందుకే దీనిపై స్పందించినట్లు చెప్పారు. తొలుత అమితాబ్ బచ్చన్ నుంచి సపోర్ట్ లభించిందని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మద్దతు తెలిపారని వెల్లడించింది. ఏదైనా ఘటన మిమ్మల్ని బాధిస్తే మౌనంగా ఉండొద్దని ఈ సందర్భంగా అమ్మాయిలకు రష్మిక సూచించారు. ధైర్యంగా ముందుకొచ్చి దానిపై స్పందిస్తే.. ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. ఇక ఇదే సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై కూడా రష్మిక స్పందించారు. నటీనటులు, క్రికెటర్లపై మీమ్స్, ట్రోల్స్ సర్వసాధారణం అని అన్నారు. అలాంటి వాటిని పట్టించుకోకూడదని చెప్పుకొచ్చారు.
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, కాజోల్, అలియా భట్ కూడా డీప్‌ఫేక్ బారిన పడ్డారు.
ఇక రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటించిన యానిమల్ (Animal) చిత్రంలో హీరోయిన్గా నటించింది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. యానిమల్ డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read..
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి
Malla Reddy | మహేశ్‌బాబు బిజినెస్‌మ్యాన్ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా : మల్లారెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

