తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ మలయాళ స్టార్ హీరో పాన్ ఇండియా కథాంశంతో చేస్తున్న తాజా చిత్రం సీతారామమ్ (Sita Ramam). వార్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్‌స్టోరీతో రాబోతున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోండగా..కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఇవాళ బక్రీద్ సందర్భంగా మేకర్స్ రష్మిక ( Rashmika Mandanna)ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ముస్లిం యువతి గెటప్‌లో ఉన్న రష్మిక బక్రీద్ విషెస్ చెబుతున్నట్టుగా ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ అనే జవాన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్.
#EidAdhaMubarak from our Rebellious #Afreen, to you and your family…#SitaRamam@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 #EidAlAdha pic.twitter.com/lcCkavGiek
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2022