టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న తాజాచిత్రం ది వారియర్ (The Warriorr). మాస్ ఎంటర్ టైనర్‌గా తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీ జులై 14న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. కన్నడ బ్యూటీ అక్షర గౌడ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..నదియా కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా ది వారియర్ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటల నుంచి షురూ కానుంది. కాగా ఈవెంట్‌కు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులు ఎవరూ రావడం లేదని లేటెస్ట్ టాక్. తాజా అప్ డేట్ ప్రకారం కేవలం చిత్రయూనిట్ మెంబర్స్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారట. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్ సత్య పాత్రలో కనిపించబోతున్నాడు రామ్.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ది వారియర్ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ కోలీవుడ్‌లో తొలి సినిమా ఇదే.