కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వారసుడు (Vaarasudu). వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రంజితమే తమిళ వెర్షన్ నెట్టింట్లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
కాగా ఇపుడు టాలీవుడ్ ప్రేక్షకుల కోసం తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. తెలుగు వెర్షన్ కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమైనట్టే తాజా సాంగ్‌తో అర్థమవుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండగా.. తమిళంలో వారిసు టైటిల్‌తో వస్తోంది. ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ ఈ చిత్రాన్ని కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వారసుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
రంజితమే తెలుగు వెర్షన్ .. లిరికల్ వీడియో
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్…
The most awaited #Ranjithame from #Vaarasudu is all yours now 🤩🤩.https://t.co/fKhHvP9f7i
🎙️ @anuragkulkarni_ & @manasimm
🎵 @MusicThaman
🖊️ @ramjowrites #Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika #BhushanKumar #KrishanKumar @SVC_official @PVPCinema @TSeries— Sri Venkateswara Creations (@SVC_official) November 30, 2022
Read Also :Sidhu Jonnalagadda | ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా.. టిల్లు 2 పుకార్లపై సిద్దు జొన్నలగడ్
Read Also :PushpaTheRise | రష్యాలో సుకుమార్, అల్లు అర్జున్ టీంకు గ్రాండ్ వెల్కమ్.. ఫొటోలు వైరల్
Read Also :RRR | ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు.. వివరాలివే