టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) మరోసారి టిల్లు 2 (Tillu 2) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా లాంఛ్ చేసిన టిల్లు 2 టైటిల్ లుక్ పోస్టర్ తో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నాడు సిద్దు. ఈ చిత్రానికి నరుడా డోనరుడా, అద్బుతమ్ ఫేం మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అనుపమపరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది.
అయితే టిల్లు 2 నుంచి అనుపమ తప్పుకుందంటూ కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట షికారు చేస్తున్నాయి. దీంతోపాటు విడుదలపై కూడా పుకార్లు హల్ చల్ చేస్తుండగా.. సిద్దు క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. అందరికీ హలో.. మీ మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. మా సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అలాగే త్వరలోనే ఇంటర్వ్యూ ఇచ్చి పుకార్లన్నింటిని క్లియర్ చేస్తా..అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న టిల్లు 2 చిత్రాన్నిశ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించడం విశేషం.
Working on #tillusquare. I promise a fresh and a new ride ! pic.twitter.com/lhlbqahzUW
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) November 26, 2022
Read Also :Sidhu Jonnalagadda | RC 15 | న్యూజిలాండ్ షెడ్యూల్‌కు ఆర్సీ 15 టీం ప్యాకప్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also :PushpaTheRise | రష్యాలో సుకుమార్, అల్లు అర్జున్ టీంకు గ్రాండ్ వెల్కమ్.. ఫొటోలు వైరల్
Read Also : Unstoppable 2 | లెజెండరీ దర్శకనిర్మాతలతో అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ 5.. ఎవరెవరంటే..!