రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) స్టార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొన్ని రోజులుగా న్యూజిలాండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది టీం. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, రాంచరణ్ టీం ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. లొకేషన్లో టీం మెంబర్స్ కేక్ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసంది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో రాంచరణ్ హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆర్సీ 15 చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్సీ 15 మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
లొకేషన్లో RC 15 టీం మెంబర్స్..
— Ram Charan (@AlwaysRamCharan) November 30, 2022
Read Also :Sidhu Jonnalagadda | ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా.. టిల్లు 2 పుకార్లపై సిద్దు జొన్నలగడ్
Read Also :PushpaTheRise | రష్యాలో సుకుమార్, అల్లు అర్జున్ టీంకు గ్రాండ్ వెల్కమ్.. ఫొటోలు వైరల్
Read Also :RRR | ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు.. వివరాలివే