PushpaTheRise | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషించిన చిత్రం పుష్ప.. ది రైజ్ (Pushpa..The Rise). సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు, రికార్డుల వర్షం కురిపించింది. కాగా పుష్ప.. ది రైజ్ రష్యాలో డిసెంబర్ 8న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ నేఫథ్యంలో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్, రష్మిక మందన్నా, అల్లు అర్జున్, నిర్మాతల బృందం ప్రమోషన్స్ లో భాగంగా రష్యాలో ల్యాండింగ్ అయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ టీంకు అక్కడి సభ్యుల బృందం ఘనంగా స్వాగతం పలికింది. డిసెంబర్ 1న మాస్కో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో పుష్ప గ్రాండ్ ప్రీమియర్స్ ఉండనున్నాయి. పుష్ప టీం రష్యా టూర్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన పుష్ప రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి పుష్ప ..ది రూల్ (Pushpa 2) తో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నారు. సీక్వెల్‌ను భారీ స్థాయిలో ఫస్ట్ పార్టును మించి తెరకెక్కించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడు సుకుమార్. పుష్ప 2లో కూడా కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ రోల్లో నటిస్తోంది.
రష్యాలో సుకుమార్ టీంకు గ్రాండ్ వెల్కమ్.. ఫొటోలు
Team #PushpaTheRise Landed in Russia 💥💥
Meet the team at the Russian language Special premieres on Dec 1st at Moscow & Dec 3rd at St. Petersburg 💥💥#PushpaInRussia from Dec 8th 🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @4SeasonsCreati1 pic.twitter.com/xwzIZHpoCR
— Mythri Movie Makers (@MythriOfficial) November 30, 2022
పుష్పరాజ్ స్టన్నింగ్ అప్డేట్ లుక్..
Meet team #PushpaTheRise at the Russian language premieres💥
Dec 1st – Moscow
Dec 3rd – St. Petersburg#PushpaTheRise releasing in Russia in Russian Language on Dec 8th 🔥#PushpaInRussiaIcon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @4SeasonsCreati1 pic.twitter.com/lyouNRRemj
— Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022