నార్నూర్ : పంచాయతీ అభివృద్ధికి సమన్వయం ( Coordination ) తో పని చేయాలని సర్పంచ్ బానోత్ కావేరి( Sarpanch Kaveri ) అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల వారీగా సమస్యలు వార్డు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులపై తీర్మానించారు.
సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని వార్డులలో సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేద్దామని సూచించారు. వార్డులలో ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యలు పరిష్కరిద్దామన్నారు. సమావేశంలో ఉపసర్పంచ్ మహ్మద్ ఖురేషి, పంచాయతీ కార్యదర్శి మోతిరామ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.