రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం 660 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ఈ కలెక్షన్స్ మార్కును దాటిన నాలుగో సినిమాగా నిలిచింది. పఠాన్, జవాన్, గదర్-2 చిత్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరో పది రోజుల్లో ఇవే స్థాయి కలెక్షన్స్ రాబడితే వెయ్యి కోట్ల మార్క్‌ను దాటడం సులభమేనని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రణ్‌బీర్‌కపూర్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్, సందీప్ రెడ్డి వంగా ైస్టెలిష్ మేకింగ్, రొమాంచితమైన యాక్ష న్ ఎపిసోడ్స్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు.‘అర్జున్ రెడ్డి’ తర్వాత దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మరో కల్ట్ మూవీని అందించాడని
ప్రశంసలొస్తున్నాయి.