Akkineni Nagarjuna | రాంగోపాల్ వర్మ-అక్కినేని కాంబోలో వచ్చి బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిన చిత్రం శివ. ఈ మూవీ మూడున్నర దశాబ్ధాల తర్వాత నవంబర్ 14న 4K వెర్షన్లో రీరిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ, నాగార్జున సెస్సేషనల్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
బాలీవుడ్ యాక్టర్ రణ్‌బీర్‌కపూర్, నాగ్ కాంబోలో బ్రహ్మాస్త్ర వచ్చిందని తెలిసిందే. ఈ మూవీ షూట్ టైంలో రణ్బీర్కపూర్ఎక్కువగా యానిమల్ గురించి చెప్పేవాడట. ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ.. మేము బ్రహ్మాస్త్ర షూటింగ్ చేస్తున్నప్పుడు రణ్‌బీర్ కపూర్ కేవలం యానిమల్ సినిమా గురించి మాత్రమే మాట్లాడేవాడు. అంతేకాదు అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ గురించి ప్రత్యేకించి చెప్పాడు. సినిమాలోని ఓ కిస్ సీన్‌ను చూపిస్తూ ఇది చాలా రియలిస్టిక్‌గా ఉందని నాతో చెప్పాడు. అప్పటికింకా యానిమల్ షూటింగ్ మొదలుకాలేదన్నాడు నాగార్జున.
రణ్‌బీర్‌కపూర్ యానిమల్ సినిమా చేస్తున్నందుకు చాలా ఎక్జయిటింగ్‌గా ఉండేవాడు. మేం ఓ పెద్ద సినిమా (బ్రహ్మాస్త్ర సినిమాద్దేశించి)కు పనిచేస్తున్నా.. రణ్‌బీర్‌కపూర్ మాత్రం యానిమల్ చేసేందుకు చాలా ఉత్సాహంగా కనిపించేవాడని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా, బాబీడియోల్ కాంబోలో తెరకెక్కిన యానిమల్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ