ముంబై : ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు (Ranbir Kapoor) ఈడీ జారీ చేసిన సమన్లపై స్టార్ హీరో స్పందించాడు. దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు తనకు రెండు వారాల సమయం కావాలని ఈడీని కోరాడు. తొలుత అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాలని రణ్‌బీర్ కపూర్‌కు జారీ చేసిన సమన్లలో ఈడీ కోరింది.
మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్స్కు సంబంధించిన సబ్సిడరీ యాప్‌ను రణ్‌బీర్ కపూర్ ప్రమోట్ చేశాడని ఈడీ ఆరోపిస్తోంది. బ్రాండ్ ప్రమోషన్ కోసం రణ్‌బీర్ కపూర్ నగదు రూపంలో సొమ్మును స్వీకరించాడని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహదేవ్ బుక్ ప్రమోటర్స్ సౌరవ్ చంద్రార్కర్, రవి ఉప్పల్ నుంచి యాప్ ప్రమోషన్ కోసం రణ్‌బీర్ హవాలా మార్గంలో డబ్బులు స్వీకరించాడని, దీనిపై నటుడి పాత్రకు సంబంధించి విచారణ సాగుతున్నదని ఈడీ పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన చంద్రార్కర్ వివాహ వేడుకకు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహ కక్కర్, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలి ఖాన్, అలి అస్ఘర్, విశాల్ దడ్లాని, ఎలి అవిరామ్, భారతి సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ బరుచా, కృష్ణ అభిషేక్, సుఖ్వీందర్ సింగ్ వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, సింగర్స్ హాజరయ్యారని చెబుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాం మహదేవ్ బుక్ యాప్ స్కామ్‌ను ఈడీ, సహా పలు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More :