అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యానిమల్ (Animal) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఓ లీక్డ్ స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. రణ్‌బీర్‌కపూర్ వైట్ కుర్తా లో ఉండగా.. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. లాంగ్ హెయిర్‌లో ఉన్న రణ్‌బీర్ ముక్కుపై గాటు కనిపిస్తోంది. ఈ లీక్డ్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమాతో బడా దర్శకనిర్మాతల చూపు తనవైపు తిప్పుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో షాహిద్కపూర్తో చేసి మరో హిట్టు కొట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
షూట్ లొకేషన్ వీడియో వైరల్ ..
ANIMAL resuming today.#RanbirKapoor #Animal pic.twitter.com/h9drE4IaQU
— souvIK. (@_xsouvIK) November 17, 2022
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?