టాలీవుడ్ (Tollywood) హీరోలు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ డైరెక్ట్ చేశారు. కాగా రానా నాయుడు మరో రెండు రోజుల్లో అంటే.. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రానా అండ్ వెంకటేశ్ టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
కాగా ఈ వెబ్ ప్రాజెక్ట్‌లో సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను వారి సమస్యల నుంచి రక్షించే పాత్రలో నటిస్తున్నాడు రానా. రిలీజ్ డేట్ గుర్తు చేస్తూ తాజాగా మేకర్స్ మరో వీడియోను రిలీజ్ చేశారు. రానా మీరు అందరు సెలబ్రిటీల సమస్యలను పరిష్కరిస్తారు. నా ఇంకొక సమస్యను పరిష్కరిస్తారా..? ప్లీజ్ అంటోంది బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Jhanvi Kapoor). జాన్వీకపూర్ తాను ముందు సీట్లో ఎప్పటికీ కూర్చోనంటోండగా.. ఎవరి ఫ్యాషన్ షోలో అని అడిగాడు రానా.
ఫ్యాషన్ షోలో కాదు కారు ముందు సీట్లో. నేనెవరితోనైనా ముందుసీట్లో కూర్చుంటే మీడియావాళ్లు అతన్ని నా బాయ్‌ఫ్రెండ్ అంటున్నారు. డ్రైవర్ అన్న భార్య కోపం తెచ్చుకుంటోందని తన బాధ చెప్పుకుంటుంది జాన్వీకపూర్. ఇది పరిష్కరించడం సులభమంటూ.. కారులో జాన్వీకపూర్‌తో రైడ్ చేస్తున్నాడు రానా. జాన్వీ, రానాని మీడియావాళ్లు రౌండప్ చేస్తే.. మీరు రిపోర్టు చేయాలనుకుంటే రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ లో వస్తోంది.. అని చేయండి అంటూ డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తోంది జాన్వీకపూర్. ఇంతకీ రానా నాయుడు సిరీస్‌లో జాన్వీకపూర్ కూడా కనిపించనుందా..? లేదంటే మేకర్స్ ఇలా ప్రమోషనల్ వీడియో చేశారా..? అనేది తెలియాలంటే రెండో రోజులు వెయిట్ చేయాల్సిందే.
రానానాయుడు ప్రమోషనల్ వీడియో..
Chinnadhaina peddhadhaina, prathi problem ki Rana dhaggara answer undhi. #RanaNaidu dropping on March 10, only on @NetflixIndia 💥@VenkyMama @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says @AshishVid #GauravChopra @rajeshjais1 @suchitrapillai @ishittaarun pic.twitter.com/hxlanKqjpq
— Rana Daggubati (@RanaDaggubati) March 8, 2023
రానా నాయుడు టీం ప్రెస్‌మీట్ స్టిల్స్..
Clicks of Victory @VenkyMama, @RanaDaggubati and Team #RanaNaidu from the Grand Press Meet in Hyderabad. 📸 ✨#RanaNaiduOnNetflix from March 10th @NetflixIndia @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says @AshishVid pic.twitter.com/xfPQYwk74t
— Suresh Kondi (@SureshKondi_) March 7, 2023
Read Also :
Dasara | ముంబైలో దసరా టీంతో నాని హోలీ వేడుకలు.. ట్రెండింగ్‌లో స్టిల్స్, వీడియో
Rama Banam | గోపీచంద్ రామబాణం నుంచి హైదరాబాదీ భామ ఫస్ట్ లుక్
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..