Rama Banam | గోపీచంద్ రామబాణం నుంచి హైదరాబాదీ భామ ఫస్ట్ లుక్
గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి రామబాణం. ఈ చిత్రంలో హైదరాబాదీ ముద్దుగుమ్మ డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామబాణంలో భైరవి పాత్ర పోషిస్తోంది డింపుల్ హయతి.
టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి రామబాణం. గోపీచంద్ 30 (Gopichand 30)గా వస్తున్న ఈ మూవీకి శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా ఈ చిత్రంలో హైదరాబాదీ ముద్దుగుమ్మ డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామబాణంలో భైరవి పాత్ర పోషిస్తోంది డింపుల్ హయతి.
తాజాగా మేకర్స్ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భైరవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. డింపుల్ హయతి క్యూట్ లుక్‌లో ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని వస్తున్న స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాసు-గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ, అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రంలో ఖుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గోపీచంద్ మరోవైపు కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్షన్లో గోపీచంద్ 31 (GopiChand 31) కూడా లాంఛ్ చేశాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుంది. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Introducing,
The Leading Lady from #Ramabanam – @DimpleHayathi as #Bhairavi ❤️Wishing a #HappyHOLI & #HappyWomensDay 😊✨#RamabanamOnMay5 🏹
Macho Starr @YoursGopichand @DirectorSriwass @vishwaprasadtg @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/852pKSh016
— BA Raju's Team (@baraju_SuperHit) March 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

