Rana Naidu 2 Vs Test | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం థియేటర్లకు ఏ మాత్రం తగ్గకుండా వినోదాన్ని అందించేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటాయి రానా నాయుడు సీజన్ 2, టెస్ట్. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ అండ్ మాధవన్ (R Madhavan)టీం మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది.
టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబినేషన్లో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. తండ్రీ కొడుకులుగా నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) మధ్య జరిగే హోరాహోరీ పోరు, ఇతర అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన రానా నాయుడు ఇక సీజన్ 2తో కూడా సందడి చేయబోతుంది.
మాధవన్, నయన తార, మీరా జాస్మిన్ కాంబోలో వస్తోన్న చిత్రం టెస్ట్ (Test). జీవితమే ఓ ఆట కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ శశికాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. భిన్న మనస్తత్వాలు, భిన్నదారులను ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రేమ, అంతులేని కలలు, లక్ష్యాలు, కోరికలు, క్రికెట్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి అందిస్తుండటం సంతోషంగా ఉందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు.
ఇక వెంకటేశ్ అండ్ మాధవన్ సినిమాల సందడి ఎలా ఉండబోతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
When the entire GC turns up 🫡🫶#NextOnNetflixIndia
📸: Sahil Behal pic.twitter.com/LwxplZ17yH— Netflix India (@NetflixIndia) February 5, 2025