టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏండ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈయన హీరోగా, కమెడియన్‌గా, నెగెటివ్ క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ యువ నటులతో కలిసి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజైన రంగ్ దే, ఏక్ మినీ కథ సినిమాల్లో తనదైన కామెడీతో మెప్పించారు. ఇప్పుడు యువ నటుడు నాగశౌర్యతో కలిసి బ్రహ్మాజీ ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే.. బ్రహ్మాజీ విషయంలో నాగశౌర్యను రానా దగ్గుబాటి హెచ్చరించాడు. బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండాలని, అతని వేషం చూసి మోసపోవద్దని సూచించాడు.
ఇంతకీ ఏం జరిగింది? రానా ఎందుకు అలా అన్నాడని అనుకుంటున్నారా.. నాగశౌర్య కథానాయకుడిగా వస్తున్న సినిమాలో బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా వీళ్లిద్దరికి సంబంధించిన కొన్ని కామెడీ సీన్ల చిత్రీకరణ జరిగింది. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో దిగిన ఫొటోను నాగశౌర్య షేర్ చేశాడు. ఇందులో బ్రహ్మాజీ, నాగశౌర్య ఇద్దరూ నామాలు పెట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫొటోను షేర్ చేసిన నాగశౌర్య.. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించండి’ అని సరదాగా ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై దగ్గుబాటి రానా కూడా అంతే ఫన్నీగా స్పందించాడు.
Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent 💪😜#NS22#IRA4 pic.twitter.com/OIgx5UFkSK
— Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021
‘వామ్మో !! ఇదేంటి గురూ !! నాగశౌర్య.. దయచేసి జాగ్రత్తగా ఉండు ! బ్రహ్మాజీ చూపుల్లో ఏదో తేడాగా కనిపిస్తుంది.. నువ్వు ఏమంటావ్ !!’ అని రానా రిప్లై ఇచ్చాడు. రానా రిప్లైకి శౌర్య కూడా సరదాగా స్పందించాడు. ‘నువ్వు చెప్పింది కరెక్టే భయ్యా. నాకు ఏదో తేడా కొడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని రిప్లై ఇచ్చాడు. వీరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్‌గా మారింది.
Haha! Correct e bhayya nuvu chepindi. Naaku edo theda kodtundi🧐🧐 jagrathaga undalsinde😅. https://t.co/bdHBz5w7xw
— Naga Shaurya (@IamNagashaurya) July 24, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా