రమ్యకృష్ణను ఏడిపించిన సీనియర్ హీరోయిన్ రేఖ
రమ్యకృష్ణ | తాజాగా ఈమె బాగా ఏడ్చేసింది. ఈమె ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రమ్యకృష్ణ ఇంతగా ఏడవడానికి కారణం ఒక సీనియర్ హీరోయిన్.

రమ్యకృష్ణ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పేరుకు తెలుగులో మాత్రమే కాదు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీని గ్లామర్ క్వీన్‌గా ఏలేసింది రమ్యకృష్ణ. ఇప్పటికీ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది రమ్య. ఐదేళ్ల కిందట బాహుబలిలో శివగామి పాత్రతో ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర లిఖించుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది రమ్యకృష్ణ. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె బాగా ఏడ్చేసింది. ఈమె ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రమ్యకృష్ణ ఇంతగా ఏడవడానికి కారణం ఒక సీనియర్ హీరోయిన్. ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ.

అసలు విషయం ఏంటంటే ఈ మధ్య ఇండియన్ ఐడల్ సీజన్ 12కి రేఖ ముఖ్య అతిథిగా వచ్చింది. రావడమే కాకుండా స్టేజ్ పై డాన్స్ చేసింది. రేఖ క్లాసికల్ డాన్సర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. 66 ఏళ్ల వయసులో రేఖా జి డాన్స్ చూసి అక్కడున్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. ఇక టీవీలో ఈ డాన్స్ చూసి రమ్యకృష్ణ ఎమోషనల్ అయిపోయింది. తెలియకుండానే ఏడ్చేసింది. మై గాడ్.. మై గాడేస్.. రేఖా గారు అని క్యాప్షన్ పెట్టి రమ్యకృష్ణ ఒక వీడియో షేర్ చేసింది. రమ్యకృష్ణ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే కెరీర్లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో సాయి తేజ్ హీరోగా వస్తున్న రిపబ్లిక్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంది రమ్యకృష్ణ. దాంతోపాటు జయలలిత బయోపిక్ క్వీన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటిస్తుంది. ఏదేమైనా రమ్యకృష్ణ ఏడుపు వీడియో బాగా వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతుంటే ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో హల్చల్
జల్సా సినిమా గుర్తు చేస్తున్న వకీల్ సాబ్ కొత్త పోస్టర్
వకీల్ సాబ్ ప్రమోషన్లో శృతి హాసన్ కనిపించడం లేదే..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
రష్మిక రిక్వెస్ట్..ఒకే చెప్పిన అల్లు అర్జున్
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
మళ్లీ ఏడిపించడానికి ఫిక్స్ అయిన శివ నిర్వాణ
విజయ్ ‘లైగర్’కు జాకీచాన్ యాక్షన్ డైరెక్టర్
విజయ్ దేవరకొండ కోసం పద్ధతులు మార్చుకున్న పూరీ జగన్నాథ్..
నటి హరితేజకు పండంటి పాపాయి
సుకుమార్ అసిస్టెంట్ స్టోరీకి మెగా హీరో ఇంప్రెస్..!
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో
లాక్డౌన్ పెళ్లి వినోదాలు
పుష్పరాజ్ డబ్బింగ్ షురూ చేశాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

