Matka | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం మట్కా (Matka). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. తాజాగా రామా టాకీస్ ర్యాంప్ సాంగ్ విడుదల చేశారు.
రామా టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవాడా..రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనం అంటూ సరికొత్త యాసలో సాగుతున్న పాట సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందని చెప్పకనే చెబుతోంది. సాయి దేవ హర్ష పాడిన ఈ పాటను కరుణకుమార్ రాయడం విశేషం. ఈ పాటకు భవానీ రాకేశ్ సంగీతం అందించాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే అజయ్ ఘోష్ పోషిస్తున్న చిల్లప్ప రెడ్డి పాత్రకు సంబంధించిన లుక్‌తోపాటు బొమ్మాళి రవిశంకర్ లుక్ విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
రామా టాకీస్ ర్యాంప్ సాంగ్..
Bringing the surprising folklore from the world of #Matka with exclusive making visuals 💥
Vibe to the most energetic and addictive beats of #RamaTalkiesRamp Song now ❤️🔥
Music by #BhavaniRakesh
Sung by #SaiDevaHarsha
Lyrics by @KKfilmmakerIN… pic.twitter.com/jLlHolBlRG
— BA Raju’s Team (@baraju_SuperHit) November 6, 2024
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్