Rama jogaiah Sastry |ఆర్ఆర్ఆర్ తరువాత పాన్ ఇండియా కథానాయకుడిగా మారిన ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ, స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా టాలీవుడ్లో అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి ఆర్ట్స్ అండ్ యువసుధా సినిమాస్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల విడుదలైన రెండో లిరికల్ సాంగ్‌కు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. అంతేకాదు ఈ సాంగ్‌పై సోషల్‌మీడియాలో చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ సాంగ్ మెల్లగా చార్ట్ బస్టర్లో చేరిపోయింది. అయితే ఇప్పడు అందరి చూపు మూడో సాంగ్‌పై వుంది. త్వరలోనే ఆ సాంగ్ రాబోతుంది.
ఇక మూడో సాంగ్ గురించి గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి పెట్టిన పోస్ట్ రానున్న సాంగ్‌పై అంచనాలు పెంచే విధంగా వుంది. ” నిన్న రాత్రి నేను ఆయుధ పూజ సాంగ్ షూట్ చూస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యాను. నా పక్కన వున్న దర్శకుడు శివ గారు డాన్స్ డ్యూయెట్ అయితే వేరే లెవల్ పూనకాలు అన్నారు. అదే మాట మీతో అన్నా నిజ్జంగా.. నిజ్జం.. అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో పాటు ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఈ చిత్ర సినిమాటోగ్రఫర్ రత్నవేలు కూడా ట్విట్టర్లో ఈ పాట గురించి పోస్ట్ చేస్తూ… పాట విజువల్‌గా ఎంత బాగుంటుందో.. అనిరుధ్ సంగీతం ఎలా వుంటుందో.. చెప్పేశాడు. దీంతో పాట విజువల్‌గా కూడా మరో స్థాయిలో వుంటుందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
నిన్న రాత్రి నేను ఆయుధపూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే పక్కనుండి మా శివ గారు డాన్స్ డ్యూయెట్ అయితే వేరే స్థాయి పూనకాలే అన్నారు ..ఆదే మాట మీతో అన్నా..నిజ్జంగా నిజ్జం 😎#Devara
— RamajogaiahSastry (@ramjowrites) August 11, 2024
Also Read..