Duvvada Srinivas | నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారు.. దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన
Duvvada Srinivas | తనపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్వల మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారని తెలిపారు. గతంలో మాధురి ఆత్మహత్యయత్నం చేసినప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానని తెలిపారు.
Duvvada Srinivas | తనపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్వల మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారని తెలిపారు. గతంలో మాధురి ఆత్మహత్యయత్నం చేసినప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానని తెలిపారు. తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని మాధురి బాధపడిందని చెప్పారు. డిప్రెషన్లో ఎటు వెళ్తున్నారో మాధురికి తెలియదని అన్నారు. డిప్రెషన్ మూడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పిందన్నారు. మాధురి కార్ యాక్సిడెంట్ డ్రామా కాదని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. డ్రామా చేయాలని అనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేదని ప్రశ్నించారు. ఈ యాక్సిడెంట్లో మాధురి తలకు గాయమైందని.. సీటీ స్కాన్ చేయాలని అన్నారు. తలకు గాయమైతే ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారని తెలిపారు.
తాను ఎవరికీ భయపడనని, నిర్మొహమాటంగా మాట్లాడతానని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అందుకే తనకు శత్రువులు పెరిగారని తెలిపారు . ఈ వ్యవహారంలో తన భార్య వైపే సమాజం మొగ్గు చూపుతుందని తెలిపారు. కానీ తన జీవితంలో భార్య వాణి ద్వారా ప్రతిక్షణం నరకం చూశానని తెలిపారు. వాణి తండ్రి రాఘవరావు ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు. తమ కాపురంలో ఆయనే మెయిన్ విలన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికైతే తాను మాధురిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. కానీ తాను బయటకు వెళ్తే తన ఇంటిని కబ్జా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను తనపై ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వం అని ఆయన ఆరోపించారు. ఆ రోజు ఇంటి డోర్ కట్ చేసినవారిమీదనే తనకు కోపమని తెలిపారు. భార్యాపిల్లలపై దాడి చేయాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు . రెండేళ్ల క్రితమే తన భార్య వాణికి డైవర్స్ నోటీసులు ఇచ్చానని పేర్కొన్నారు.
కాగా, దువ్వాడ శ్రీనుతో సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న పలాస జాతీయ రహదారిపై యాక్సిడెంట్ చేసినందుకు గానూ ఆమెపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 కింద ఈ కేసు నమోదైంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

