ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. తన కన్న వయసులో పెద్ద అయిన అంజలీని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ జంట ఒక్కటై 30 ఏళ్లు దాటింది. అంజలికి పెళ్లి ప్రపోజ్ చేసిన విషయాన్ని సచిన్ అత్త అన్నాబెల్లి మెహతా ఇటీవల రిలీజ్ చేసిన తన బుక్‌లో రాశారు. 19 ఏళ్ల లేత వయసులోనే సచిన్ టెండూల్కర్ తన కుతురికి పెళ్లి ప్రపోజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నది. కానీ వాళ్ల నిశ్చితార్థం గురించి చాలా సీక్రెట్ మెయింటేన్ చేసినట్లు ఆమె తెలిపింది. మై ప్యాసేజ్ టు ఇండియా అనే బుక్‌లో ఆమె ఈ విషయాలను తెలిపింది.
ఆ సమయంలో భారత జట్టులో సచిన్ టెండూల్కర్ ఎదుగుతున్న క్రికెటర్ అని తెలుసు. కానీ తనకు ఓ ఆందోళన ఉండేదని, అతను ఎక్కడ కొందరు క్రికెటర్ల తరహాలో ప్లేబాయ్ అవుతాడేమో అన్న టెన్షన్ ఉండేదని సచిన్ అత్త అన్నాబెల్లి తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నది. 90వ దశకంలో ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ తరహాలో సచిన్ టెండూల్కర్‌కు ప్రజాదరణ ఉండేదన్నారు. అతని కళ్లల్లోకి చూసి, తన కుతురు గురించి ఏం అనుకుంటున్నాడో తెలుసుకోవాలని అనిపించిందని ఆమె రాసింది.
అయితే సచిన్ ఇచ్చిన రెస్పాన్స్‌తో ఆమె సర్ప్రైజ్ అయినట్లు తెలిసింది. చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు సచిన్ తెలిపాడని, ఆ మాటలు విని తాను ఆశ్చర్యపోయినట్లు అన్నాబెల్లి పేర్కొన్నది. చాలా ఎత్తైన హ్యాండ్సమ్ వ్యక్తిని అంజలి పెళ్లి చేసుకుంటుందని భావించినట్లు ఆమె తన బుక్‌లో రాశారు. కానీ 19 ఏళ్ల వయసులో సచిన్ ఓ పిల్లాడిలా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడని, అజంలి కన్నా కాస్త పెద్దగా ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు.
సచిన్, అంజలీ.. 1995లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండున్న దశాబ్ధాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించారు.