Andhra King Taluka | టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని లీడ్ రోల్లో నటిస్తోన్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వంలో RAPO 22గా వస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా రామ్ ఫినిషింగ్ అప్డేట్ అందించాడు. ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా లొకేషన్లో రామ్ అండ్ టీం కేక్ కట్ చేశారు. ఈ సినిమా త్వరలో మీ అందరినీ గర్వంగా ఫీలయ్యేలా చేస్తుంది. నా కెరీర్లో అందమైన సినిమాను అందించిన మహేశ్ బాబుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ టాప్ హీరో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించనున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకా గ్లింప్స్‌లో సినిమా రిలీజ్ రోజు తన అభిమాన హీరో స్టైల్‌ను అనుకరిస్తూ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ‘ఆంధ్రాకింగ్ ఫ్యాన్స్ తాలూకా..’ అంటూ యాభై టిక్కెట్లు అడగగానే.. మేనేజర్ టిక్కెట్లు ఇస్తాడు. దాంతో రామ్ ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు చేసుకుంటాడు. అభిమాని పాత్రలో రామ్ నయా అవతార్‌లో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Finally wrapped the shoot.
A film I’m proud of..
A film we will all be proud of..Soon!Thank you @filmymahesh for this beautiful film in my career.#AndhraKingTaluka is coming to you..#AKTonNOV28 pic.twitter.com/obNzzH5lcx
— RAm POthineni (@ramsayz) November 2, 2025