టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ 19వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీకి సెట్స్ పైకి వెళ్లే టైం ఫిక్సయింది. జులై 12 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడులో కొనసాగుతున్నాయి. రామ్-లింగుస్వామి కాంబోలో తొలిసారి వస్తున్న ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ను మేకర్స్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు.
చాలా పెద్ద వార్త. రామ్-19 జులై 12 నుంచి షురూ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి చూడండి అని మేకర్స్ ట్వీట్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్. డూప్ యాక్షన్ డైరెక్టర్లుగా అన్బు, అరివు వర్క్ చేయబోతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
The Big News is Here! 🎇#RAPO19 Shoot Commences on July 12th, Stay tuned for more updates
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 7, 2021
Ustaad @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @NavinNooli @anbariv pic.twitter.com/5P27TZok7g
ఇవి కూడా చదవండి..
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్