Ram Gopal Varma | వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. ఆరేళ్ల కిందటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు (Andheri Magistrate court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయన్ని దోషిగా తేలుస్తూ.. మూడు నెలల జైలు శిక్ష విధించింది.
2018లో రాంగోపాల్ వర్మపై చెక్‌బౌన్స్ కేసు (cheque bounce case) నమోదైంది. మహేష్‌చంద్ర మిశ్రా (Mahesh Chandra Mishra) అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. వర్మ ఒక్కసారి కూడూ కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ (non bailable warrant issued) చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది.
Also Read..
Ram Gopal Varma | సిండికేట్.. ఆధునిక భారతాన్ని ప్రమాదంలో నెట్టేసే భయంకరమైన కూటమి: రామ్‌గోపాల్‌వర్మ
Anil Ravipudi | వినోదమే నా బలం.. అందుకే అన్నీ సూపర్‌హిట్స్: అనిల్ రావిపూడి
Threat | పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు