Game Changer Teaser | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నవంబర్ 9న లక్నోలో గ్రాండ్‌గా గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
లక్నోలోని ప్రతిభ థియేటర్ నుంచి షురూ అయి మరో రెండు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ లాంచ్ సందడిగా సాగనుంది. నవంబర్ 9న మూడు రాష్ట్రాలు 11 థియేటర్లలో సాయంత్రం 4:30 గంటల నుంచి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, ఖమ్మం, రాజమండ్రి, నెల్లూరు ప్రాంతాల్లో లాంచ్ ఉండబోతుండగా.. కర్ణాటకలో బెంగళూరులోని ఊర్వశి థియేటర్లో లాంచ్ ఈవెంట్ జరుగనుంది.
ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Let the games begin from Lucknow and spread like wild fire across India🔥
Celebrate #GameChangerTeaser in 3 States and 11 Theatres on Nov 9th, 4:30 PM onwards 💥
In cinemas worldwide from 10th Jan.#GameChanger#GamechangerOnJAN10 🚁 pic.twitter.com/a0ryfyycKF
— BA Raju’s Team (@baraju_SuperHit) November 7, 2024
Pushpa 2 Vs Chaava | పుష్పరాజ్ ఫీవర్.. అల్లు అర్జున్‌తో పోటీపై విక్కీ కౌశల్ వెనక్కి తగ్గాడా..?
Prithviraj Sukumaran | కరీనాకపూర్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ రొమాన్స్..!
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్