Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ బయటకు వచ్చింది.
రాంచరణ్ అండ్ టీం ఈ వారం రాజమండ్రిలో చిత్రీకరణ షురూ చేయనుంది. వారం రోజులపాటు అక్కడే చిత్రీకరణ కొనసాగనుంది. గేమ్ ఛేంజర్‌ను అక్టోబర్ 31న విడుదల చేసేందుకు రెడీ అవుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గేమ్ ఛేంజర్‌లో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్ కాగా.. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దీంతోపాటు సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
#RamCharan will resume shooting for #GameChanger this week in Rajamundry. The shoot will last for a week.
❤️ Releasing on October 31. pic.twitter.com/uIEP50IMAE
— Gulshan Katiyar (@GulshanKatiyar) June 3, 2024