జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే. చూడముచ్చటైన అందం, చక్కటి అభినయంతో ఈ అమ్మడు యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవలే ఈ సొగసరి ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.
తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ బోర్సే తొలిసారి మహిళా ప్రధాన చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. 90దశకం మద్యపాన నిషేధం నాటి రోజుల్లో జరిగే కథ ఇదని, ఇందులో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడే ధీరోదాత్తురాలైన యువతిగా భాగ్యశ్రీ బోర్సే పాత్ర ఉంటుందని సమాచారం.
స్వప్న సినిమాస్, వేణు ఊడుగుల సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.