టాలీవుడ్ (Tollywood) నటుడు రాంచరణ్ (Ram Charan ) త్వరలో అభిమానులకు సరికొత్తగా కనిపించబోతున్నాడు. తాజాగా ట్విటర్ లో ఓ సర్ ప్రైజ్ ఫొటోను షేర్ చేస్తూ అందరిలో జోష్ నింపుతున్నాడు. తాజా ఫొటోషూట్ కు సంబంధించిన స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీ స్క్రీన్లపై సరికొత్త వినోద ప్రపంచాన్ని తీసుకురావడానికి అంతా సిద్ధంగా ఉంది. త్వరలో ఎక్జయిటింగ్ సర్ ప్రైజ్ ఉంటుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చాడు రాంచరణ్.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ+హాట్ స్టార్ (Disney+Hotstar) తెలుగు వింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేశాడు రాంచరణ్. దీనికి సంబంధించిన ప్రోమో కోసం తాజా ఫొటోషూట్ లో పాల్గొన్నాడు. ప్రోమో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల విషయానికొస్తే రాంచరణ్ ప్రస్తుతం ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామ రాజుపాత్రలో నటిస్తున్నాడు.
All set to bring a world of entertainment to your screens 🔥Something exciting coming soon! pic.twitter.com/abxXzmRoOh
— Ram Charan (@AlwaysRamCharan) September 17, 2021
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్