RC15 | రాంచరణ్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్.. ఆర్సీ 15 టైటిల్, ఫస్ట్ లుక్ టైం ఫిక్స్
రాంచరణ్ (Ram Charan) నటిస్తోన్న ఆర్సీ 15 (RC15) చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.
టాలీవుడ్ హీరో రాంచరణ్ (Ram Charan) నటిస్తోన్న తాజా చిత్రం ఆర్సీ 15 (RC15). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. రేపు రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ 15 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేయనున్నట్టు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా అప్డేట్ షేర్ చేసింది.
రేపు ఉదయం 8:19 గంటలు, మధ్యాహ్నం 3:06 గంటలు అంటూ రెండు సమయాలను ట్వీట్లో పెట్టారు మేకర్స్. ఒక్కో టైంలో ఒక్కో అప్డేట్ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. హైదరాబాద్‌లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్‌ను ప్రభుదేవా టీం నేతృత్వంలో షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి CEO, సర్కారోడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తుండగా.. రేపు దీనిపై క్లారిటీ ఇవ్వనుంది శంకర్ టీం.
ఈ చిత్రంలో అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Let’s celebrate Mega Powerstar @alwaysramcharan’s birthday tomorrow with the title and first look poster of #RC15 #SVC50.
💥💥8:19 AM & 3:06 PM💥💥 @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official
— Sri Venkateswara Creations (@SVC_official) March 26, 2023
Read Also :
Shaakuntalam | సమంత శాకుంతలం 3డీ ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్
MM Keeravani | నా మొదటి ఆస్కార్ రాంగోపాల్ వర్మ.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Orange | ఆరెంజ్ రీరిలీజ్.. అప్పుడు డిజాస్టర్ టాక్.. ఇప్పుడు ఆల్‌టైమ్ రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

