Disney hotstar | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాకుండా దాన్ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు కూడా ఆయనతో భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. అయిపోయిన వెంటనే శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. 200 కోట్ల బడ్జెట్‌తో శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈయన నిర్మాణ సంస్థలో అది 50వ సినిమా కావడం గమనార్హం. దాంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శంకర్, రామ్ చరణ్ సినిమా వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ హాట్ స్టార్ డిస్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. దీనికి సంబంధించిన ఒక కమర్షియల్ యాడ్ కూడా విడుదలైంది. బిగ్‌బాస్ వేదికపై దీన్ని అట్టహాసంగా ప్రదర్శించారు. ఇందులో షో మాన్ గా కనిపిస్తున్నాడు రామ్ చరణ్. వచ్చింది వినోద విశ్వం అంటూ హాట్ స్టార్ డిస్నీ సంస్థను ప్రమోట్ చేస్తున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దానికి తోడు బ్రాండ్ అంబాసిడర్ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు హాట్ స్టార్. ఏడాదికి ఈ ఎండార్స్మెంట్ కోసం రామ్ చరణ్‌కు దాదాపు 5 నుంచి 7 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా మిగిలిన బ్రాండ్స్ కూడా చాలానే చేస్తున్నాడు రామ్ చరణ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..