Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే రూ.186 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.
అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధించిన సందర్భంగా మెగా అభిమానులంతా కలిసి రామ్ చరణ్ ఇంటికి పోటెత్తారు. అభిమానుల రాకతో మెగా కంపౌండ్ మొత్తం సందడి సందడిగా మారింది. రామ్ చరణ్ కూడా తన భవనం పైన నుంచి అభిమానులను పలకరించాడు. అయితే ఎంతోదూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం రామ్ చరణ్ భోజనం ఏర్పాటు చేశాడు. అభిమానులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోమని రామ్ చరణ్ తన సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Ram Charan arranged food🍲🍽️ at his home to fans who gathered to wish the global star after Game Changer success. pic.twitter.com/YcXigBgXv2
— Manobala Vijayabalan (@ManobalaV) January 11, 2025
Ram Charan waves👋🏻 to his fans who gathered in large numbers after Game Changer success. pic.twitter.com/4NdHC7T5RK
— Manobala Vijayabalan (@ManobalaV) January 11, 2025
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించి అలరించాడు.
Also Read..