టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) -స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. RAPO 20 వ ప్రాజెక్ట్‌గా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ షురూ అయింది.
యాక్షన్ సన్నివేశాలతో తాజా షెడ్యూల్ మొదలైనట్టు ఇన్ సైడ్ టాక్. కాగా యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటం కోసం బోయపాటి యాక్షన్ కొరియోగ్రఫర్ స్టన్ శివకు కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చాడట. బోయపాటి ప్లాన్‌కు అనుగుణంగా మాస్ యాంగిల్లో స్టన్ శివ యాక్షన్ సీన్లుండబోతున్నాయని సమాచారం. యాక్షన్ పార్ట్‌లో ప్రత్యేకించి ఒక సీక్వెన్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా ఉండబోతుందని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఈ చిత్రంలో హీరో రామ్‌కు జోడీగా పెళ్లిసందD ఫేం శ్రీలీల నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనుంది. ఊర్వశి రౌటేలా ఇప్పటికే రామ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఈ విషయాన్ని అందరితో పంచుకుంది. ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రామ్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
Read Also: Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
Read Also: Prakash Raj | కొత్త ప్రకాశ్‌రాజ్‌ను చూస్తారు.. రంగమార్తాండ సినిమాపై విలక్షణ నటుడు
Read Also: Sreenu Vaitla | డైరెక్టర్ శ్రీను వైట్ల ఫాం కేర్ టేకర్‌ను కాటేసిన పాము
Read Also: Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!