Rakul Preet Singh | రకుల్ వేసిన ఈ యోగాసనం గురించి తెలుసుకోవాల్సిందే
కొత్త కొత్త యోగాసనాలతో, వర్కవుట్ సెషన్లతో నెటిజన్లు, ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది రకుల్ (Rakul Preet Singh). రకుల్ కొత్తగా చెబుతున్న యోగా పాఠం పేరు హై లంగ్ ప్రేయర్ ట్విస్ట్ (High Lunge Prayer Twist ).

టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) నటి మాత్రమే కాదు ఫిట్ నెస్ నిపుణురాలు కూడా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొత్త కొత్త యోగాసనాలతో, వర్కవుట్ సెషన్లతో నెటిజన్లు, ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది రకుల్. రోజూవారి వర్కవుట్స్, బలాన్ని, శక్తిని పెంచే వ్యాయామాలు కండరాల పనితీరు మెరుగుపరచడానికి, డీటాక్సిఫికేషన్ తోపాటు ప్రశాంతతను అందించడానికి గొప్పగా పనిచేస్తాయి. ఇవన్నీ కేవలం ఒకే ఒక యోగసనం ద్వారా మన శరీరానికి అందుతాయంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇంతకీ రకుల్ చెబుతున్న యోగా పాఠం పేరు హై లంగ్ ప్రేయర్ ట్విస్ట్ (High Lunge Prayer Twist ).
రకుల్ జిమ్ లో హై లంగ్ ప్రేయర్ ట్విస్ట్ ఆసనాన్ని వేస్తున్నపుడు తీసిన స్టిల్‌ను ఆమె శిక్షకురాలు అన్షుకా (Anshuka ) ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. శక్తిని ఆర్జించేందుకు, డీటాక్సిఫికేషన్ కు, ప్రశాంతత కోసం రకుల్ ఈ ఆసనం వేస్తోందని క్యాప్షన్ ఇచ్చింది. అనన్యపాండే, అలియాభట్, కరీనాకపూర్ లాంటి సెలబ్రిటీలకు శిక్షణ ఇస్తుంది అన్షుకా. బలం, నిర్విషీకరణ, ప్రశాంతత కోసం రకుల్ ప్రీత్ సింగ్ సమతుల్య మలుపులు. శరీరం, మనస్సుపై ట్విస్ట్‌లు పనిచేసే విధానాన్ని ఇష్టపడండి. ప్రత్యేకమైన హై లంగ్ ప్రేయర్ ట్విస్ట్ ఆసనం కూడా నాకు ఇష్టమైన వాటిలో ఒకటి..పలు రకాల హ్యాష్ ట్యాగ్ లను జోడించింది అన్షుకా. రకుల్ లైట్ బ్లూ స్పోర్ట్స్ జిమ్ వేర్ లో ప్రార్థన చేస్తున్న మూడ్‌లో వేసిన యోగాసనం ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
హై లంగ్ ప్రేయర్ ట్విస్ట్ యోగాసనం వల్ల పొట్ట ప్రాంతంలోని అవయవాల పనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియ చురుకుగా సాగుతుంది. మన శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియను ప్రమోట్ చేయడంలో ఈ ఆసనం చాలా కీలకంగా పనిచేస్తుంది. అయితే ఈ ఆసనాన్ని యోగా టీచర్ కానీ, నిపుణుల సలహాలతో కానీ చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

