Rakul | ఏ విషయమైనా నేనే చెబుతా.. పెండ్లి వార్తలపై రకుల్ సీరియస్

Rakul preet singh marriage | రకుల్ ప్రీత్ సింగ్ పెండ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు రకుల్ ప్రకటించింది మొదలు.. తరచూ ఆమె పెండ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెండ్లి చేసుకుని ఒక ఇంటివారు కాబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రకుల్ సీక్రెట్‌గా పెండ్లి చేసుకుందన్న రూమార్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తన పెండ్లిపై వస్తున్న పుకార్లను చూసి రకుల్ సీరియస్ అయింది. అనవసరంగా అసత్యాలు ప్రచారం చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయమైనా సరే తానే అందరితో పంచుకుంటానని రకుల్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం తన చేతిలో పది సినిమాలు ఉన్నాయని.. ఇప్పుడు తన దృష్టి అంతా వాటిపైనే ఉందని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. అందుకే తనపై వచ్చే రూమర్స్‌ను పట్టించుకునే అంత తీరిక లేదని పేర్కొంది. అయినా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పెండ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. తన జీవితం గురించి పూర్తి క్లారిటీ ఉందని.. తనకు సంబంధించిన ఏ విషయమైనా ముందుగా తానే చెబుతానని స్పష్టం చేసింది. ఇక తన ప్రియుడు భగ్నానీ గురించి చెబుతూ.. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.. మా దగ్గర ఉన్నవారికి మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది అని పేర్కొంది. ప్రతి విషయంలో ఇద్దరం ఒకేలా ఉంటామని, ఫుడ్ అయినా.. వర్కవుట్స్ అయినా కచ్చితంగా అది ఫాలో అవుతామని చెప్పింది. ఇన్ని అభిరుచులు కలిశాయి కాబట్టే కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నానని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ ఫొటోలను షేర్ చేయకండి.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎమోషనల్ పోస్ట్
rakul | రకుల్ ప్రీత్ నయా బిజినెస్ ఐడియా.. ఒక్క ఛాన్స్ అని ఎదురుచూసే ఆర్టిస్ట్‌ల కోసం..
Rakul | రహస్యాల్ని దాచిపెట్టొద్దు!
Rakul: కొండపొలం కోసం రకుల్ నేర్చుకున్న ప్రత్యేక భాష ఏంటో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

