e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News rakul | ర‌కుల్ ప్రీత్ న‌యా బిజినెస్ ఐడియా.. ఒక్క ఛాన్స్ అని ఎదురుచూసే ఆర్టిస్ట్‌ల కోసం..

rakul | ర‌కుల్ ప్రీత్ న‌యా బిజినెస్ ఐడియా.. ఒక్క ఛాన్స్ అని ఎదురుచూసే ఆర్టిస్ట్‌ల కోసం..


rakul preet singh started starting you | తోబుట్టువులంటే.. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అంతలోనే ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకుంటారు. సినీనటి రకుల్‌ ప్రీత్‌, ఆమె తమ్ముడు అమన్‌ ప్రీత్‌ కూడా అంతే. ఈ అక్కాతమ్ముళ్లు ఓ అడుగు ముందుకేసి.. సినిమా పరిశ్రమ గురించీ ఆలోచించారు. కొత్త టాలెంట్‌కు, పరిశ్రమ వర్గాలకూ మధ్య వారధిగా ఓ యాప్‌ రూపొందించారు.

 rakul preet singh and aman started starting you
rakul preet singh and aman started starting you

సినిమాల్లో అవకాశాల కోసం ఉన్న ఉద్యోగాన్ని, సొంత ఊరిని వదిలేసుకుని వస్తుంటారు. ‘ఒక్క చాన్స్‌’ అంటూ హైదరాబాద్‌, ముంబై వీధుల్లో ఆశగా తిరుగుతుంటారు. అయినా, అదృష్టం వరిస్తుందన్న భరోసా లేదు. ఇలాంటి వాళ్లకు చేయూత అందిస్తుంది.. నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన సోదరుడితో కలిసి డిజైన్‌ చేసిన ‘స్టారింగ్‌ యూ’. ఇదొక లింక్డిన్‌ లాంటి అప్లికేషన్‌. ఇందులో వివరాలను నమోదు చేసుకుని.. నటన, సంగీతం, నృత్యం.. ఇలా తమ ప్రత్యేకతకు సంబంధించి వీడియోలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ యాప్‌తో అనుసంధానమైన ప్రొడక్షన్‌ హౌస్‌లు, డైరెక్టర్ల్లు తమ చిత్రాలకు అవసరమైన ప్రతిభావంతులను దీనిద్వారా ఎంచుకోవచ్చు. ఇందులో ఎప్పటికప్పుడు కాస్టింగ్‌ అప్‌డేట్స్‌, ఆడిషన్స్‌కి సంబంధించిన వివరాలు పెడుతుంటారు. దీంతో స్టూడియోలు, దర్శకుల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదు. సొంతూళ్లోనే ఉంటూ, లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ.. సినిమా ప్రయత్నాలు కొనసాగించవచ్చు. లేనిపోని భ్రమలతో, అర్థంలేని ప్రలోభాలతో అందర్నీ వదిలేసుకొని వచ్చి.. ఏ ఒక్కరూ కష్టపడకూడదన్నదే రకుల్‌ ప్రీత్‌ ఆలోచన.

- Advertisement -

‘కరోనా సమయంలో ఎంతోమంది నటీనటులు ఉపాధి అవకాశాలు కరువై బాధపడటం చూశాను. అదే సమయంలో ఇండస్ట్రీలోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో సోషల్‌ మీడియా రీల్స్‌ ద్వారా తెలుసుకున్నాను. సినిమా పరిశ్రమలో స్థిరపడటం అన్నది ఎంత కష్టమో చాలామందికి తెలియదు. మంచి ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలేసి అవకాశాల కోసం వస్తుంటారు. అలాంటివాళ్లకు తమ ప్రతిభను పరిశ్రమ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఇస్తే బాగుంటుందని అనిపించింది. నా తమ్ముడు, నేను కలిసి ఈ యాప్‌ను రూపొందించాం. ఇటు టాలెంట్‌ను, అటు టాలెంట్‌ హంటర్స్‌ను డిజిటల్‌గా కలిపే వేదిక ఇది’ అంటారు రకుల్‌. ‘యాక్టర్స్‌కి మాత్రమే కాదు.. సింగర్స్‌, రైటర్స్‌, డైరెక్టర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌.. ఎవరైనా మా యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. నాకు అక్కతో పని చేయడం కొత్తేమీ కాదు. మేమిద్దరం గతంలో జిమ్స్‌ నిర్వహించాం’ అంటున్నాడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

rakul | అలాంటి జీవితం బోర్‌ కొడుతుంది!

Rakul: ఇప్ప‌ట్లో పెళ్లి లేన‌ట్టే .. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్

Rakul: ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం.. అంద‌రు సుర‌క్షితం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement