fire accident in rakul preet singh home | హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్రి ప్రమాదం జరిగింది. ముంబైలో ఆమె నివాసం ఉంటున్న బిల్డింగ్‌లోని 12వ అంతస్తులో ఈప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్న రకుల్.. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు సినిమాలతో బిజీ అయింది. అంతేకాకుండా.. ఈఏడాది తన పుట్టినరోజు సందర్భంగా.. రకుల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. నిర్మాత జాకీ భగ్నానీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ.