రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చిన తర్వాత పాత నీరు పోవాల్సిందే. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ప్రతి ఐదేళ్లకు కొత్త హీరోయిన్లు రావడం.. అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న వాళ్లు సైడ్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. మూడేళ్ల కింది వరకు ఏ సినిమాలో చూసినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా కనిపించేది. కానీ ఇప్పుడు రష్మిక మందన, పూజా హెగ్డే టైం నడుస్తుంది. ఈ మధ్య చాలా సినిమాల్లో వీళ్లే హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. స్టార్ హీరోలు కూడా రకుల్ ప్రీత్, తమన్నా లాంటి హీరోయిన్ల వైపు చూడటం లేదు. ఇలాంటి సమయంలో రకుల్‌కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
రకుల్‌కు చాలా రోజుల తరువాత తెలుగులో ఒక పెద్ద హీరో నుంచి పిలుపువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. అన్ని భాషలలో కలిపి ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అయితే పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఈమెకు అల్లు అర్జున్ లాంటి బడా హీరో నుంచి పిలుపు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు పరశురామ్.
ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. సంక్రాంతికి సర్కారు వారి పాట విడుదల కానుంది. దీని తర్వాత అల్లు అర్జున్‌తో ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు పరశురామ్. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ముందు రష్మిక మందనను అనుకున్నారు. కానీ చివరికి రకుల్ ప్రీత్ వైపు దర్శక నిర్మాతలు అడుగు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రకుల్‌కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

