ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ, హనీ ట్రాప్ వ్యవహారం ఎంత దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్నోగ్రఫీ వ్యవహారంలో రాజ్‌కుంద్రా అరెస్ట్ కాగా,ఆయన బాగోతాలు మెల్లమెల్లగా బయటకు వచ్చాయి. ఇక తాజాగా హనీ ట్రాప్ వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు వంద మంది సెలబ్రిటీల నగ్న వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కి దిగారట.
సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబై సైబర్‌క్రైమ్ పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో బాలీవుడ్‌కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉన్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఇషాఖాన్ అనే మోడల్, నటి ముంబైలోని బాంద్రా ఫైవ్ స్టార్ హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.
పథకం ప్రకారం హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. ఇషాఖాన్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.