OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?

OTT | ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల హవా నడుస్తోంది. ఇది ఇప్పుడు చాపకింద నీరులా థియేటర్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒకప్పుడు సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత 50 రోజులకు కానీ ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చేది కాదు. కానీ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత విడుదలైన 30 రోజుల్లోనే కొత్త సినిమాలు నెట్టింట దర్శనమివ్వడం మొదలయ్యాయి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో కరోనా వైరస్ వచ్చి డిస్ట్రిబ్యూటర్లపై గుదిబండ వేసింది. లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి. నిర్మాతలకు ఊహించని మొత్తం చెల్లించి మరీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సినిమాలను కొనేస్తున్నాయి. దీంతో థియేటర్ల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మీడియా ముందుకొచ్చి మొర పెట్టుకుంటున్నారు.
ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే థియేటర్ ముందు ఎంతో హంగామా ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇలాగే ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత.. రాబోయే తరం థియేటర్లో సినిమాలు చూడటం దాదాపు మానేస్తారు. అదే గానీ జరిగితే ఇండస్ట్రీకి అంత కంటే దారుణం మరొకటి ఉండదు. ఎందుకంటే థియేటర్లో చూస్తేనే సినిమా.. 300 మంది కూర్చున్న ఒక హాల్లో విజిల్స్, కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా.. నాలుగు గోడల మధ్యలో చూస్తే ఆ ఫీల్ ఎప్పటికీ రాదని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అభిమానులు కూడా ఈ మాటతో ఏకీభవిస్తున్నారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం తమకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు.
మొన్న వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో నేరుగా విడుదలైంది. ఇక ఇప్పుడు నితిన్ మాస్ట్రో.. నాని టక్ జగదీష్ సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే విడుదలవుతున్నాయి. ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు పెద్ద సినిమాలు కూడా ఇదే బాట పట్టడం ఖాయం అని భయపడుతున్నారు ఎగ్జిబిటర్లు. థియేటర్లు లేకపోతే హీరోలు లేరు.. ఇండస్ట్రీ లేదు అంటూ వాళ్లు చరిత్ర చెబుతున్నారు. మరి దీనికి మన నిర్మాతలు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఏదేమైనా కూడా ఓటీటీ మెల్లగా తెలుగు ఇండస్ట్రీని కమ్మేస్తుంది అనేది కాదనలేని నిజం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
ముంబైలో మకాం.. సమంత స్పందన ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

