జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు కచ్చితంగా ఆయన సీఎం అవుతాడంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు టార్జాన్.

జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆయన రక్తంలోనే రాజకీయం ఉంది. తాత పెట్టిన పార్టీ కోసం 2009 ఎన్నికల్లో చెమటలు కక్కేలా ఎండల్లో గొంతు చించుకుని అరిచాడు తారక్. అప్పటి ఎన్నికల ప్రచారాన్ని కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం ఉంటున్నాడు జూనియర్. పైగా ఈయనను రాజకీయంగా వాడుకుని వదిలేశారంటూ కొందరు ప్రచారం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రాజకీయాలపై ఓ టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనెవరో కాదు.. టార్జాన్ లక్ష్మీనారాయణ.

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో తాను పడ్డ ఇబ్బందుల గురించి టార్జాన్ లక్ష్మీనారాయణ ఇటీవల తెలిపాడు. సినిమా వాతావరణానికి అలవాటు పడేందుకు తనకు ఏడేళ్లు పట్టిందని తెలిపాడు. సినిమా షూటింగ్‌ల సమయంలో భోజనం చేసేటప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు. సినిమా ఇండస్ట్రీలో మొహమాటం అసలు పనికిరాదని.. అవకాశాలను అడుక్కోకపోవడం వల్ల తాను చాలా ఛాన్సులు మిస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిగత విషయాలను చెబుతూనే నూటికి నూరు శాతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు కచ్చితంగా ఆయన సీఎం అవుతాడంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు టార్జాన్.
ఎన్టీఆర్ కూడా టీడీపీ అంటే తాతగారు స్థాపించిన పార్టీ అంటారని టార్జాన్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఎన్టీఆర్ తెలంగాణ లేదా ఆంధ్రాకు సీఎం కావచ్చని.. ఆయనకు ఆ ఛరిష్మా ఉందన్నాడు. తన ఇంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ మై సీఎం అని ఉంటుందని చెప్పాడు లక్ష్మీనారాయణ. ఆయనతో కలిసి అరవింద సమేత సినిమా మాత్రమే చేశానని.. ఆ సినిమా షూటింగ్ సమయంలో నమస్కారం సీఎం గారు అన్నానని లక్ష్మీనారాయణ తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
క్రేజీ అప్ డేట్..సత్యదేవ్ భార్యగా నయనతార !
బాలకృష్ణ మూవీ ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!
రియా చక్రవర్తి భావోద్వేగ సందేశం..నెట్టింట్లో వైరల్
Raja Raja Chora | ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

