Balakrishna | బాలకృష్ణ మూవీ ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!
నందమూరి బాలకృష్ణ (Balakrishna)-గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబోలో 107వ ( #NBK107) ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ (Balakrishna)-గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబోలో 107వ ( #NBK107) ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విలన్, హీరోయిన్ ఎవరన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. క్రాక్ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న శృతిహాసన్ (Shruti Haasan) ను హీరోయిన్ గా ఫైనల్ చేయబోతున్నారని టాక్ కొద్ది రోజులుగా వినిపిస్తోంది. కాగా మరోవైపు ఉప్పెన సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi )ని విలన్ గా తీసుకుంటారన్న వార్త తెరపైకి వచ్చింది.
అయితే గోపీచంద్ మలినేని విజ్ఞప్తిని శృతిహాసన్ సున్నితంగా తిరస్కరించిందని, డైరెక్టర్ సెంటిమెంట్ ను కాదనలేక గెస్ట్ రోల్ అయితే చేస్తానని శృతిహాసన్ చెప్పినట్టు మరో అప్ డేట్ ఇప్పటికే బయటకు వచ్చింది. విజయ్ సేతుపతి కూడా శృతిహాసన్ లాగే గోపీచంద్ మలినేని ఆఫర్ కు నో చెప్పాడన్న న్యూస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో గోపీచంద్ మలినేని ఇతర యాక్టర్లను సంప్రదించే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి పెద్ద స్టార్లను బాలకృష్ణ సినిమాకు తీసుకుందామని ప్రయత్నిస్తున్న గోపీచంద్ మలినేనికి చుక్కెదురవుతుందని తెగ చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి బాలయ్యతో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరో..? ఆయనతో ఫైట్ చేసే ఆ క్రేజీ యాక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలంగా ఆగాల్సిందే.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

