Bhimla Nayak | భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?

Bhimla Nayak | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మల్టీస్టారర్నే కానీ టైటిల్లో పవన్ ఒక్కడే కనిపిస్తున్నాడు. రానాను పూర్తిగా పక్కనబెట్టేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌నే వాడుకుంటూ భీమ్లా నాయక్ సినిమాను తీసుకున్నారు. నిజానికి మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ ఇద్దరి పాత్రలకు ఒకే రకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి రానా పాత్రను తగ్గించేసి విలన్‌గా చూపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఇగో వార్నే ఈ సినిమా స్టోరీ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ చేసే పనులు చూస్తుంటే విలనిజం అనిపించదు. ఆయన చేసే పనులు ఇగోతో చేస్తుంటాడు. కానీ ఆ సీన్లు చూసినప్పుడు మనకు నెగెటివ్ అనిపించదు. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో రానా చేస్తున్నాడు. అయితే పవన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రానా పాత్రను తగ్గిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా వరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రానాను విలన్‌గా చూపిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తే తప్పు లేదు కానీ డానియల్ పాత్రను తక్కువ చేస్తే మాత్రం అసలుకే మోసం వస్తుందంటున్నారు విశ్లేషకులు. సినిమాపై అంచనాలు ఎంతున్నాయో.. ప్రమాద హెచ్చరికలు కూడా అన్నే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి మల్టీస్టారర్ రీమేక్స్ అంటే కత్తి మీద సామే. ఏ మాత్రం అటూ ఇటూ అయినా కూడా చాలా ప్రమాదం. అందుకే దర్శకుడు సాగర్ కే చంద్ర అనుభవం సరిపోదనే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. ఇప్పుడు పవన్‌ను చూపించి బిజినెస్ కూడా పూర్తి చేస్తున్నారు. అలాగని సినిమాలో పవన్‌ను తక్కువ చేస్తే అభిమానులతో సమస్య.. ఎక్కువ చేస్తే కథకు సమస్య. మరి ఇలాంటి టాస్క్‌ల మధ్య త్రివిక్రమ్ సినిమాను ఎలా పూర్తి చేస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
క్రేజీ అప్ డేట్..సత్యదేవ్ భార్యగా నయనతార !
బాలకృష్ణ మూవీ ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!
రియా చక్రవర్తి భావోద్వేగ సందేశం..నెట్టింట్లో వైరల్
Raja Raja Chora | ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

